Monday, November 17, 2025
HomeతెలంగాణSeethakka in hostel: స్టూడెంట్స్ తో కలిసి హాస్టల్లో బస చేసిన మంత్రి సీతక్క

Seethakka in hostel: స్టూడెంట్స్ తో కలిసి హాస్టల్లో బస చేసిన మంత్రి సీతక్క

విద్యార్థులతో కలిసి..

మహబూబాబాద్ జిల్లాలోని పాకాల కొత్తగూడ మండల కేంద్రంలో వున్న గిరిజన గురుకుల పాఠశాల, ఇంటర్ కళాశాల హాస్టల్లో రాత్రి బస చేసిన మంత్రి సీతక్క. ఉదయం నిద్రలేచాక విద్యార్థినులతో కలసి యోగా, వ్యాయామ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు మంత్రి సీతక్క.

- Advertisement -

పుస్తకాలతో కుస్తీ పడితే సరిపోదు

దేశ భ‌విష్య‌త్తు త‌ర‌గ‌తి గ‌దిలోనే నిర్మిత‌మ‌వుతోందన్న సీతక్క, విద్య అంటే కేవ‌లం పుస్త‌కాల‌తో కుస్తీ మాత్ర‌మే కాదని విద్యార్థుల్లో నయా జోష్ నింపుతూ కలిసిపోయారు. సంపూర్ణ విద్యతోనే చిన్నారుల సర్వతోముఖాభివృద్ది సాధ్య‌ప‌డుతోంది. అందుకే విద్యార్థుల్లో విజ్ఞాన, మేధో, మానసిక, శారీరక, భావోద్వేగ సామర్థ్యాన్ని పెంపొందించ‌డమే మా ప్ర‌జా ప్ర‌భుత్వ ల‌క్ష్యమని సీతక్క విద్యార్థులకు వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad