Friday, November 22, 2024
HomeతెలంగాణMinister Sridhar Babu: ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ సెంటర్

Minister Sridhar Babu: ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ సెంటర్

జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రి

యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్లు, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు చేపడుతున్నామని, ప్రైవేటు రంగంలోనూ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలను ముమ్మరం చేస్తున్నామని వివరించారు.

- Advertisement -

జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల మంత్రి డి శ్రీధర్ బాబు గారు వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సికింద్రాబాద్ లోని డైరెక్టర్ అండ్ కమిషనర్ యూత్ సర్వీసెస్ కార్యాలయం లో యువజన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జాబ్ మేళని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. సెట్విన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో ప్రిన్సిపల్ కార్యదర్శి సవ్యసాచి ఘోష్, సెట్విన్ ఎండీ వేణుగోపాల్ పాల్గొన్నారు. 5 వేల ఉద్యోగాల కల్పనకు నిర్వహించిన జాబ్ మేళాలో 80 కంపెనీలు పాల్గొనగా… 6500 మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ… స్వామి వివేకానంద ఆలోచనలు, వారి మార్గం యువతకి ఆదర్శమని తెలిపారు. యువ వయసులో మంచి విద్య , ఉద్యోగం అవసరమని అన్నారు. యువత సమస్యలను పరిష్కరించాలన్న భావతతో ఉద్యోగ కల్పన గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని స్పషఖటం చేశారు. గత పదేళ్లలో ఒక దశాదిశ లేకుండా రాష్ట్రం నడిచిందని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. యువత కూడా ఒక లక్ష్యం తో ముందుకు వెళ్లాలని, వివేకానంద స్ఫూర్తి తో లక్ష్య సాధన లో విజయం సాధించాలని ఆశిస్తున్నానన్నారు.

గ్రామీణ ప్రాంతంలో యువత పెడదారిపట్టే దారులునున్నాయని, కాబట్టి మాదక ద్రవ్యాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ అనే మాటవినిపిం చొద్దు అని నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ దిశగా ముందుకు వెళ్తున్నామని ప్రకటించారు. గత ప్రభుత్వం ఉద్యోగ భర్తీ పట్ల నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. ప్రైవేట్ రంగంలోని మరిన్ని లక్షల మందికి ఉద్యోగ కల్పన లో ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ప్రతి జిల్లా కేంద్రం లో స్కిల్ సెంటర్ , స్కిల్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. పరిశ్రమల స్థాపన, వాటికి కావాల్సిన నైపుణ్యాన్ని వెలికతీసేందుకు స్కిల్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో మానవ వనరుల రంగంలో తెలంగాణ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండబోతుందని తేల్చిచెప్పారు.

“మాది ప్రజల ప్రభుత్వం. భాష విషయంలో బాధ పదద్దు. స్కిల్ యూనివర్సిటీస్ ద్వారా మీకు అందులో ప్రావీణ్యం లభిస్తుంది. మీ ప్రతిభ బయటకు వస్తుంది .. మేము మీ కోసమే పని చేస్తున్నం. గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత ను మోటివెట్ చేసి ముందుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాము. ప్రత్యేక నిధులు ఏర్పాటు తో వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాము”అని యువతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆర్టిఫషియల్ ఇంటెలిజెన్స్ లో డిగ్రీ చదువుకన్న వారికి సైతం ఒక ప్రత్యేక కోర్సు అందుబాటులోకి తెబోతున్నమమని, ఆ రంగం లో కూడా యువతకి ఉపాధి తో పాటు రాష్ట్ర అభివృద్ది చెందుతుందని అభిప్రాయపడ్డారు. సానుకూల దృక్పథంతో యువత ముందుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్ లోనే కాకుండా జిల్లా కేంద్రాల్లో కూడా జాబ్ మేళ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

కాగా 35 వేల మందికి ఇప్పటికే పలు జాబ్ మేళ ద్వారా ఉద్యోగాలు అందించినట్టు యూత్ సర్వీస్ విభాగం అధికారులు మంత్రికి తెలియజేశారు. మేళ లో ఉద్యోగం కోసం వచ్చిన యువతతో మంత్రి ప్రత్యేకంగా కలిసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News