ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదవ, కురుమ సంఘ ఆత్మగౌరవ భవనాలను పరిశీలించారు మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్. వేల కోట్ల విలువైన కోకాపేటలో 10 ఎకరాల్లో 10 కోట్లతో రెండు భవనాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. రెండు అంతస్తుల్లో అన్ని సదుపాయాలతో భవనాల నిర్మాణం తుది దశకు చేరుకుంది. మార్చ్ 10వ తారీఖున ప్రారంభించేలా పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక వసతుల్ని బిసి ఆత్మగౌరవ సముదాయాలకు త్వరితగతిన ఏర్పాటు చేయాలని మంత్రులు ఆదేశించారు.