నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో రెడ్డి సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి శంఖుస్థాపన కార్యక్రమంలోతెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని వై జంక్షన్ లో రెడ్డి సంక్షేమ సంఘ భవనానికి శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. ఇతర వర్గాల ప్రజలను ఆదరిస్తూ,అన్ని వర్గాల వారికి రెడ్డి సామాజిక వర్గం వాళ్లు ఆదర్శంగా ఉండాలని ఆయన ఈసందర్భంగా హితబోధ చేశారు. రెడ్డి కులంలో ఉన్న నిరుపేదలకు కూడా కల్యాణ లక్ష్మి అందిస్తున్నట్టు ఆయన గుర్తుచేశారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు. మిర్యాలగూడ రెడ్డి సంక్షేమ భవన్ నిర్మాణానికి ఎమ్మెల్సీ నిధుల నుండి ఇప్పుడు 50 లక్షలు, తరువాత మరో 50 లక్షలు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ ఎన్ ఉత్తంకుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి, మున్సిపల్ చైర్మన్ భార్గవ్, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి , మిర్యాలగూడ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు అనుముల మధుసూదన్ రెడ్డితో పాటు స్థానికంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన లీడర్లంతా పాల్గొన్నారు.