తెలుగుప్రభ తెలుగు దినపత్రిక 2024 క్యాలెండర్ , డైరీని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజా సమస్యలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజాదరణ పొందిన తెలుగు దినపత్రిక తెలుగుప్రభ అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పత్రికల ద్వారా ప్రజలను చైతన్య పరచడం దినపత్రికల బాధ్యత అన్నారు.
అదేవిధంగా ప్రజలకు పాఠకులకు తెలుగుప్రభ దినపత్రిక యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఆనంద్ కుమార్, సాంబయ్య గౌడ్, జిల్లెల్ల రాములు, తెలుగుప్రభ నియోజకవర్గ ఇన్చార్జి శేఖర్, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణయ్య, కాంగ్రెస్ నాయకులు ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.