కూకట్ పల్లి నియోజకవర్గం కే.పి.హెచ్.బి కాలనీ టెంపుల్ బస్ స్టాప్ వద్ద డాక్టర్ రేష్మి, చెన్న అంజలి సారధ్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏ.ఆర్.సి డెంటల్ ఆసుపత్రిని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన వైద్యం అందించాలనే సదుద్దేశంతో ఈ హాస్పిటల్ ను స్థాపించామని అన్నారు.
దంతాలకు సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు రూట్ కెనాల్, ఎత్తు వంకర పళ్ళను సరి చేయడం, ఇంప్లాంట్స్, నోటి క్యాన్సర్ వంటి తదితర చికిత్సలకు సంబందించి వైద్యమందిస్తామన్నారు.
దంత వైద్యం అంటే తీవ్రనొప్పి, చాలా ఖర్చుతో కూడుకున్నదనేది అపోహ మాత్రమేనని, తాము చాలా తక్కువ ఖర్చుతో నొప్పి లేకుండా అన్ని రకాల దంత వైద్యం అందిస్తామన్నారు.