భువనగిరి నియోజకవర్గం భూదాన్ పోచంపల్లి పట్టణంలో శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి 10వ వార్డ్ లో ఇంటింటికి తిరిగి వార్డ్ లో ఉన్న సమస్యలను తెలుసుకొని తక్షణమే సమస్యలను పరిష్కరించే విధంగా పనులు చేపడతామని హామీ ఇచ్చారు. వార్డులో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నారాయణస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచంపల్లి మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధిపరుస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బాత్క లింగస్వామి కౌన్సిలర్లు మోటె రజిత రాజు, పెద్దల చక్రపాణి, సామల మల్లారెడ్డి బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సీత వెంకటేష్ ప్రధాన కార్యదర్శి గునిగంటి మల్లేష్ గౌడ్ ఉపాధ్యక్షుడు చేరాల నరసింహ, భువనగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ దొడ్డమోని చంద్రం యాదవ్, 10వ వార్డ్ ఇన్చార్జ్ కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీనారాయణ దేవాలయం చైర్మన్ అంకం యాదగిరి, బిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సీత శ్రవణ్, సారా బాలయ్య, బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు తంగెళ్ల దశరథ, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ అజ్జు, రావుల లావణ్య శ్రీనివాస్ బిఆర్ఎస్ యువజన నాయకులు ప్రభాకర్ చారి, దొడ్డమని దినేష్ యాదవ్, గోశిక కార్తీక్, కొయ్యడ కిరణ్ గౌడ్, బిఆర్ఎస్ కార్యకర్తలు, కాలనీ వాసులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.