రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని జడ్పీ వైస్ చైర్మేన్ సిద్దం వేణు కార్యాలయంలో తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ మాట్లాడుతూ గ్యారంటీ కార్డు పేరుతో కొత్త బిచ్చగాళ్లు ప్రజలను గందరగోళం చేస్తున్నారని అన్నారు. 40 ఏళ్ల కాలంలో చేయని అభివృద్ధిని, ఇప్పుడు అధికారంలోకి రావాలనే దురుద్దేశ్యంతో కాంగ్రెస్ దొంగ హామీలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నారు. 2009 నుంచి ఇప్పటి వరకు కవ్వంపల్లి సత్యనారాయణకు మానకొండూర్ నియోజకవర్గ ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారని, ఇప్పుడు కూడా కవ్వంపల్లికి ప్రజలు మరోసారి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ఇల్లంతకుంట మండలంతో పాటు నియోజకవర్గములోని అన్నీ గ్రామాల్లో వందలాది కోట్లతో అభివృద్ధి చేయడం, ఒకప్పుడు ఇల్లంతకుంట మండలంలోని రైతులు సాగునీళ్లు లేక బొంబాయి, బీవండి, హైదరాబాద్ లతో పాటు గల్ఫ్ దేశాలకు వెళ్లే వారని, తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అనంతగిరి, మధ్యమానేరు ప్రాజెక్టు ల ద్వారా భీడుభూములకు సాగు నీళ్లు ఇస్తున్నామని ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు కూలీలు వలస వస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మండల అధ్యక్షుడు పల్లె నర్సింహా రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.