Friday, September 20, 2024
HomeతెలంగాణMLA Sandra: స్కూల్ బ్యాగ్స్, కిట్స్ పంపిణీ

MLA Sandra: స్కూల్ బ్యాగ్స్, కిట్స్ పంపిణీ

కల్లూరు పోలీసుల గొప్ప హృదయం

కల్లూరు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, కిట్స్ పంపిణీ చేశారు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఎసిపి రామానుజం ముఖ్యఅతిథిలుగా పాల్గొని, నియోజకవర్గంలోని ఐదు మండలాల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న (పోలీస్ శాఖ వారు ఎంపిక చేసిన ) విద్యార్థినీ, విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, కిట్స్ పంపిణీ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర, ఎసిపి రామానుజం, సి.ఐ హనూక్ మాట్లాడుతూ విద్యార్థులు చదువును ఆయుధంగా చేసుకొని సమాజంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కాంక్షించారు.

కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, పోలీస్ శాఖ అధికారులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News