ఆర్టీసీ వ్యవస్థను ప్రభుత్వ శాఖలోకి విలీనం చేయడాన్ని హర్షిస్తూ మహబూబాబాద్ పట్టణంలోని బస్ డిపో ఆవరణలో మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం డిపోను పరిశీలించి, ఆర్టీసి బస్సును నడిపి డ్రైవర్లను సిబ్బందిని ఉత్తేజపరిచారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఈ కార్యక్రమంలో
మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రాంమ్మోహన్ రెడ్డి, జడ్పిటిసి లునావత్ ప్రియాంక, వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, మార్నేని వెంకన్న, గద్దె రవి, యాళ్ల మురళీధర్ రెడ్డి, బుజ్జి వెంకన్న, అశోక్, ఆవుల వెంకన్న, గోగుల రాజు, కౌన్సిలర్లు, సర్పంచులు, భారాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
MLA Sankar Naik as driver: డ్రైవర్ గా మారిన ఎమ్మెల్యే
బస్సు నడిపి ఆర్టీసీ ఉద్యోగుల్లో హుషారు నింపిన ఎమ్మెల్యే