Tuesday, September 17, 2024
HomeతెలంగాణMLA Sathish Kumar: రైతుల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం

MLA Sathish Kumar: రైతుల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమ ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి, రైతు బంధు, రైతు బీమా అనే కార్యక్రమాలు చేపట్టి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అనేక విధాలుగా కృషి చేస్తుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలిపారు. చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామంలో చిగురుమామిడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. చిగురుమామిడి మండల కేంద్రంలో, లంబాడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, రంజాన్ సందర్భంగా ముస్లింలకు రంజాన్ తోఫా అందజేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎంపిపి కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ గీకురు రవీందర్, ప్యాక్స్ చైర్మన్ రమణారెడ్డి, రైసస మండల అధ్యక్షుడు పెనుకుల తిరుపతి, తహశీల్దార్ ముబిన్ అహ్మద్, రైసస జిల్లా సభ్యుడు సాంబారి కొమురయ్య, సర్పంచులు బెజ్జంకి లక్ష్మణ్, సన్నీల వెంకటేష్, బోయిని శ్రీనివాస్, సుద్దాల ప్రవీణ్, పిట్టల రజిత శ్రీనివాస్, భవాని అరుణ్, వకుళ లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ మిట్టపల్లి మల్లేశం, డిప్యూటీ తహశీల్దార్ రవికుమార్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రజిత కృష్ణమాచారి, ప్యాక్స్ వైస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, డైరెక్టర్లు శ్రీనివాస్ యాదవ్, చిట్టుమల్ల శ్రీనివాస్, సింగిల్ విండో సీఈవో కాటం నర్సయ్య, ఏపీఎం సంపత్, సీసీలు వెంకటమల్లు, సంపత్,సత్యనారాయణ, నాయకులు కత్తుల రమేష్, శివ ప్రసాద్, రాజిరెడ్డి, ఆకుల మొగిలి, పోటు మల్లరెడ్డి, సత్యనారాయణ, సిరాజ్, రాంబాబు, సది కుమార్, రమేష్, విష్ణుమాచారి, రైతులు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News