Friday, September 20, 2024
HomeతెలంగాణMLA Satish: మళ్లీ బీఆర్ఎస్ కే అధికారం

MLA Satish: మళ్లీ బీఆర్ఎస్ కే అధికారం

చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్ రావు పాల్గొన్నారు. టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మండలం నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు తమ అభిప్రాయాలను ఎమ్మెల్యే ముందుంచారు. మండలంలో పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడి పని చేస్తున్న కార్యకర్తలను గుర్తించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. వచ్చే ఎన్నికలలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటూమని, ఆ దిశగా పార్టీ కోసం నిరంతరం కష్టపడతామని ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు నాయకులు వాగ్దానం చేశారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతం కరువు కాటకాలతో రైతులు హరిగోస పడ్డారని… నేడు స్వరాష్ట్రంలో పసిడి పంటలతో అలరారుతుందని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వం.రాష్ట్రంలో రైతుల అభివృద్ధి కోసం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. రాజకీయ అవగాహన లేని కొందరు నాయకులు విమర్శలు చేస్తున్నారు . నేను ఎమ్మెల్యేగా రాకముందు ఈ ప్రాంతం ఎలా ఉందో ఇప్పుడు ఎలా మారిందో అన్ని ప్రజలకు తెలుసని… తప్పుడు విమర్శలు చేస్తున్న నాయకులకు సరైన సమయంలో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి సహకారంతో అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. చిగురుమామిడి మండలంలో గతంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండేదని గతుకుల రోడ్లో పోయి… బ్రహ్మాండమైన రోడ్లను నిర్మాణం చేసుకున్నామని తెలిపారు. ఈ మండలం సాగుకు అనుకూలమైనదని… మంచి సారవంత భూమి కలిగి ఉన్న ఈ మండలానికి పూర్తిస్థాయిలో సాగునీరు వస్తే మండలం గొప్పగా అభివృద్ధి చెందుతుందని… త్వరలోనే మిగిలిపోయిన గ్రామాలకు పూర్తిస్థాయిలో గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామని తెలిపారు. చిగురుమామిడికి కరువు మండలం అనే పేరు పోయింది. కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా మండలంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని ఇప్పుడు సంవత్సరానికి రూ.200 కోట్ల విలువైన పంటలు ఇక్కడి రైతాంగం పండిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో హుస్నాబాద్ నియోజకవర్గం గొప్పగా అభివృద్ధి చేసుకుంటామని దానికి అనుగుణంగా పార్టీలోని కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి,జడ్పీటీసీ గీకురు రవీందర్, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి,బీఆర్ఎస్ మండల ఇన్చార్జి కర్ర రవీందర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, వైస్ ఎంపీపీ బేతీ రాజిరెడ్డి, ఆలయ చైర్మన్ గందే సంపత్, నాయకులు రామోజు కృష్ణమాచారి, పెద్దపెల్లి అరుణ్ కుమార్, సాంబారి కొమరయ్య, పెనుకుల తిరుపతి,ఎండి సర్వర్ పాషా, బెజ్జంకి రాంబాబు, మహిళా నాయకులు అందే సుజాత, గొల్లపల్లి అరుణ, శ్రీలత రెడ్డి, బొల్లం వెంకటలక్ష్మి,సర్పంచులు బెజ్జంకి లక్ష్మణ్, జక్కుల రవీందర్, పిట్టల రజిత,సన్నీల వెంకటేశం, ఎంపీటీసీలు మెడబోయిన తిరుపతి, మిట్టపల్లి మల్లేశం,పెసరి జమున రాజేశం వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు అభిమానులుతదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News