Saturday, September 21, 2024
HomeతెలంగాణMLA Satish: అంబరం అంటేలా దశాబ్ది ఉత్సవాలు

MLA Satish: అంబరం అంటేలా దశాబ్ది ఉత్సవాలు

తెలంగాణ దశాబ్ది సంబురాలు అంబరాన్ని అంటాలని, జూన్ 02 – 2023 నుండి జూన్ 22 – 2023 వరకు వైభవంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరిగింది. జూన్ 3 తెలంగాణ రైతు దినోత్సవం సందర్బంగా 39 వేల మంది రైతులతో రైతు దశాబ్ది ఉత్సవాలతో హుస్నాబాద్ నియోజకవర్గ దశాబ్ది ప్రగతిని చాటి చెప్పాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్ల పై టీచర్స్ ట్రయినింగ్ సెంటర్ లో అధికారులతో, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….రాబోవు 21 రోజుల దశాబ్ది ఉత్సవాల ప్రణాళిక,ఏర్పాట్లపై ఖులంకషంగా అధికారులతో, ప్రజాప్రతినిధులతో చర్చించారు. జూన్ 2 అంటే రేపు ఉదయం 9 గంటలకు అమరులకు నివాళులర్పించి పతాక ఆవిష్కరణ జరుగుతుందని,జూన్ 3 తెలంగాణ రైతు దినోత్సవం సందర్బంగా నియోజకవర్గంలో 39 రైతు వేదికలలో ఒక్కొక్క రైతు వేదిక లో 1000 మందితో మొత్తం 39 వేల మంది రైతులతో రైతు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్నీ రైతు వేదికలు ఘనంగా ముస్తాబు చేసి రైతులకు కేసీఆర్ చేసిన సంక్షేమం నాడు తెలంగాణ రాకముందు ఎలా ఉంది ఇప్పుడు తెలంగాణ రైతుల పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది అని అన్నారు, ఈ ఉత్సవాల్లో పాల్గొన్న రైతులకు భోజనాలు ఏర్పాటు చేయాలని అన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత నియోజకవర్గంలో అన్ని రంగాల్లో జరిగిన ప్రగతి చాటేలా, పండగ వాతావరణం లో ఘనంగా దశాబ్ది వేడుకలు నిర్వహించాలని తెలిపారు..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 9 సంవత్సరాల స్వయం పాలన పూర్తి చేసుకోని 10 వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా జూన్ 2 నుంచి జూన్ 22 వరకు 21 రోజుల పాటు వైభవంగా దశాబ్ది వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, శతాబ్ది కాలంలో జరగని అభివృద్ధి కేవలం దశాబ్ది కాలంలోనే జరిగింది అని,రేపటి తరానికి స్ఫూర్తి నింపడానికి తెలంగాణా ప్రభుత్వం జూన్ 2 నుండి 22 వరకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుందని, తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని, అధికారులు ,ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఉత్సాహంగా పనిచేయుటకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలిపారు.

స్థానిక ప్రజాప్రతినిధులు… అధికారులు సమన్వయంతో, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పండుగ వాతావరణంలో… ఉత్సవాలు జరపాలి, నిర్దేశించిన రోజుల్లో ఆయా శాఖలు తమ కార్యక్రమాలను, సమన్వయంతో,సమర్ధవంతంగా నిర్వహించాలని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News