Friday, September 20, 2024
HomeతెలంగాణMLA Satish: విద్యార్థులకు క్రమశిక్షణ తప్పనిసరి

MLA Satish: విద్యార్థులకు క్రమశిక్షణ తప్పనిసరి

న్యాక్ A++ కలిగిన 7వ ఇంజనీరింగ్ కాలేజ్ ఇదే

కీట్స్ కళాశాలల కార్యదర్శి, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ విద్యార్థులనుద్దేశించి కీలక ప్రసంగం చేస్తూ, విద్యార్థులకు క్రమశిక్షణ తప్పనిసరి అన్నారు. హుజురాబాద్ మండలం సింగాపూర్ లోని కమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో ప్రథమ సంవత్సర విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ కందుకూరి శంకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కళాశాల ఉన్నతమైన నాణ్యమైన సాంకేతిక విద్యకు పెట్టింది పేరు అని అన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో న్యాక్ (A++) ఏ ప్లస్ ప్లస్ కలిగిన ఏడవ ఇంజనీరింగ్ కళాశాల అని తెలిపారు. పార్లమెంట్ మాజీ సభ్యుడు ఒడితల రాజేశ్వరరావు ఆలోచన విధానం మేరకు గ్రామీణ ప్రాంతం విద్యార్థులకు ఉన్నతమైన నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందించాలని లక్ష్యంతో ఈ కళాశాల స్థాపించడం జరిగిందని అన్నారు. క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు మాత్రమే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. విద్యార్థి తరగతులకు తప్పని సరిగా హాజరు కావాలని, ఒకవేళ హాజరు శాతం తక్కువగా ఉంటే జేఎన్టీయూ హైదరాబాద్ నిబంధన ప్రకారము విద్యార్థి డిటెన్షన్కు గురి కాగలరన్నారు. పరీక్షలు రాయుటకు అనుమతిని ఇవ్వరని సూచించారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాలకు ఎన్బీఏ (NBA) నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ గుర్తింపు వుందని పేర్కొన్నారు. ఇతర ఇంజనీరింగ్ కళాశాలలో లేని మౌలిక సదుపాయాలు కిట్స్ సింగాపురంలో ఉన్నాయని వివరించారు.

- Advertisement -

ఎన్సిసి నేషనల్ క్యాండిడేట్ కాప్స్(NCC), ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్(NSS), స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్(SAC), ఉన్నత ప్రమాణాలు కలిగిన ఉపాధి మరియు శిక్షణ సంస్థ, వివిధ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో స్టూడెంట్ అసోసియేషన్, దాదాపు 50 వేల ప్రింట్ పుస్తకములు, లెక్కలేనన్ని ఆన్లైన్ పుస్తకాలు, ఆన్లైన్ జర్నల్స్ ను కలిగిన లైబ్రరీ వుందన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారము ఉండవలసిన అన్ని పరికరాలు మరియు సాఫ్ట్వేర్ , విశాలమైన క్రీడా మైదానములు, ఇండోర్ స్టేడియం, జిమ్ సెంటర్ , ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ సెంటర్, బాల బాలికలకు వేరువేరు ఇన్ క్యాంపస్ హాస్టల్స్ మరెన్నో ఉన్నాయని, ఇన్ని సదుపాయములు కలిగిన మరొక ఇంజనీరింగ్ కళాశాల లేదని, కళాశాల ఆవరణ మొత్తం పచ్చదనంతో నిండి ఉంటుందని, క్యాంపస్ మొత్తము చల్లగా ఉంటుందని బయట ఉష్ణోగ్రతకు ఇక్కడికి తక్కువ రెండు డిగ్రీ సెంటీగ్రేడ్లు తక్కువగా ఉంటుందని చెప్పారు. విద్యార్థి చదువుకోవడానికి కావలసిన అన్ని అవసరాలు ఇక్కడ ఉన్నాయని అన్నారు. పోయిన సంవత్సరము దాదాపు 350 మంది విద్యార్థులకు క్యాంపస్ లో ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు. అంతకుముందు సంవత్సరము 500 ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. విద్యార్థుల క్షేమం దృష్ట్యా సతీష్ కుమార్ తల్లిదండ్రులకు కొన్ని సూచనలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News