హుస్నాబాద్ నియోజకవర్గంలోని తండాలకు రోడ్ల నిర్మాణం కోసం గిరిజన అభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా 31 కోట్ల 58 లక్షల రూపాయలు మంజూరు చేసిందని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేసుకున్నామని అలాగే తండాలలో మౌలిక సదుపాయాల కోసం అత్యధిక నిధులు కేటాయించి గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. గిరిజనుల కోసం అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తుచేశారు అలాగే అడగగానే నిధులు ఇచ్చినందుకు గిరిజన సంక్షేమ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కి ఇందుకు సహకరించిన సీఎం కేసీఆర్, కేటీఆర్, ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ధన్యవాదములు తెలియజేశారు.