Sunday, September 22, 2024
HomeతెలంగాణMLA Satish Kumar: కోహెడలో 108 సేవలు ప్రారంభం

MLA Satish Kumar: కోహెడలో 108 సేవలు ప్రారంభం

నూతన 108 అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

కోహెడ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నూతన 108 అంబులెన్స్ వాహనాన్ని ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోహెడ మండలానికి అడగగానే 30 లక్షల విలువ గల అంబులెన్స్ వాహనాన్ని మంజూరు చేసినందుకు వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. మండల కేంద్రం నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఈ అంబులెన్స్ సేవలు అందిస్తుందని, ప్రజల ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి వివిధ పథకాలను ప్రవేశపెట్టిందని కెసిఆర్ కిట్టు, ఉచితమందుల పంపిణీ, డయాగ్నెట్స్టిక్ సేవలు, వివిధ పరీక్షల కోసం ల్యాబ్ సౌకర్యం ఆసుపత్రుల లో ప్రవేశపెట్టిందని ఆసుపత్రిలో డాక్టర్లు మరియు స్టాప్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ఒకప్పుడు నేను రాను బిడ్డ సర్కారు దావకానకు అనే పరిస్థితి నుండి నేను సర్కారు దావకానకే పోతాను అనే విధంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని మంజూరు చేయడం జరిగిందని ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడు పాటుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జడ్పిటిసి మండల అధ్యక్షుడు సర్పంచులు వార్డు మెంబర్లు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News