హుస్నాబాద్ పట్టణం కేజేఆర్ గార్డెన్ లో హుస్నాబాద్ నియోజకవర్గ తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం టిఆర్ఎస్ ఎంఏ ఆధ్వర్యంలో జరిగిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో ప్రైవేటు ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి, సమాజంలో మొదటి అడుగు వేయించేవారు అలాగే విద్యార్థులకు విద్యను నేర్పి సమాజంలో మంచి పౌరులుగా భవిష్యత్తులో వారు ఉన్నత స్థానాల్లో స్థిరపడటానికి తోడ్పడేవారు, తల్లిదండ్రుల తర్వాత అంతటి పాత్ర ఉపాధ్యాయులు పోషిస్తారని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు నా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా వేల మంది టీచర్లు పాల్గొన్నారు.