మహిళల సమగ్ర అరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు, మహిళల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆరోగ్య మహిళా పథకాన్ని సైదాపూర్ మండలంలోని ప్రాథమిక అరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రతీ మహిళ ఆరోగ్యంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష, మహిళ ఆరోగ్యమే ఇంటికి సౌభాగ్యం అనే నమ్మే నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు.ఆరోగ్య మహిళా పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్య మహిళ పథకంలో 8 రకాల చికిత్సలు అందుబాటులో ఉంటాయని, ఆరోగ్య మహిళా కేంద్రాల్లో నిపుణులైన మహిళా సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారఖ్, కెసిఆర్ న్యూట్రిషన్ కిట్,కెసిఆర్ కిట్, ఆరోగ్య మహిళ, గృహ లక్ష్మి, వి హబ్ వంటి పథకాలు దేశానికే ఆదర్శం.
మహిళ ప్రగతికి మూలం అని నమ్మిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు.మహిళల అన్ని రకాల ఆరోగ్య సమస్యలు పరిష్కరించేందుకు ఆరోగ్య మహిళ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని అన్నారు.వైద్య సేవలు, అవసరమైన పరీక్షలు, మందులు కూడా ఉచితంగా ఇస్తారు. పేద,మధ్య తరగతి మహిళలందరి కోసం ఈ ఆలోచన మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం, దేశం ఆరోగ్యంగా ఉంటుంది.ఈ ఆరోగ్య మహిళ కేంద్రంలో ప్రతి మంగళవారం మహిళలకు పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు చేసి, రోగ నిర్ధారణ చేసుకొని తదుపరి వైద్య సేవలను అందిస్తారని తెలిపారు.
ఆరోగ్య మహిళా కేంద్రాల ద్వారా 8 విభాగాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలను అందిస్తామన్నారు. రొమ్ము క్యాన్సర్, సర్వైవల్ క్యాన్సర్ మొదలగు వాటికి కూడా ప్రాథమిక పరీక్షలు ఆరోగ్య కేంద్రాలలో నిర్వహిస్తామని అన్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యం దిశగా అందరం కలిసి పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జడ్పిటిసి ఎంపిటిసిలువార్డు సభ్యులు పార్టీ కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.