Saturday, November 23, 2024
HomeతెలంగాణMLA Sunke Ravi: రోడ్డు పునరుద్ధరణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

MLA Sunke Ravi: రోడ్డు పునరుద్ధరణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

6.17 కోట్ల రూపాయలతో ..

కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం వెలిశాల గ్రామంలో సుమారు 12 కిలోమీటర్ల మేర 6.17 కోట్ల రూపాయలతో నిర్మించే రోడ్డు పునరుద్ధరణ పనులకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలిశాల నుండి గుడ్డేలుగుల పల్లి, గట్టుబూత్కూర్, చిన్నఆచంపల్లి, ఆచంపల్లి వరకు రోడ్డు పునరుద్ధరణ పనులు చేయనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రోడ్డు పునరుద్ధరణ చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీర్ల సరోజన ప్రభాకర్ రావు , సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, ఎఎంసి చైర్మన్ మామిడి తిరుపతి, వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జెడ్పి కోఆప్షన్ సభ్యుడు సుకురుద్దీన్, ఏఎంసీ మాజీ చైర్మన్ గంట్ల వెంకట్ రెడ్డి, బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గంట్ల జితేందర్ రెడ్డి వివిధ గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News