Tuesday, October 8, 2024
HomeతెలంగాణMLA Viveka: కొంపల్లి అభివృద్ధి పనులకు శంకుస్థాపన

MLA Viveka: కొంపల్లి అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ప్రతి కాలనీ అభివృద్ధే మా ధ్యేయం

జయదర్శిని ఎనక్లేవ్ 20 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే, కొంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు వివేకా. సాయికృప అపార్టుమెంట్స్ లో 10 లక్షల వ్యయంతో బి టి రోడ్డు పనులు మరియు 32 లక్షల వ్యయంతో డ్రైనేజీ పైప్ లైన్ పనుల ప్రారంభోత్సవానికి శంకుస్థాపన చేశారు. ప్రజయ్ అపార్టుమెంట్స్ లో 18 లక్షల వ్యయంతో కె.ఎల్ .సంప్ వెల్ పనుల శంకుస్థాపన చేశారు.

- Advertisement -

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జయదర్శిని ఎనక్లేవ్ 20 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్, సాయి కృప అపార్ట్మెంట్ లో 10 లక్షల వ్యయంతో బి.టి. రోడ్డు పనులు, 32 లక్షల వ్యయంతో డ్రైనేజీ పైప్ లైన్ పనులు, ప్రజయ్ అపార్ట్మెంట్ లో 18 లక్షల వ్యయంతో కె.ఎల్ .సంప్ వెల్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ ముఖ్య అతిథిగా స్థానిక మున్సిపల్ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్ వైస్ చైర్మన్ గంగయ్య మరియు కౌన్సిలర్ల తో కలిసి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి కాలనీ అభివృద్ధే తమ ధ్యేయం అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సీనియర్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘ నాయకులు, సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News