తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్లు(MLC Nominations) దాఖలు చేశారు. అసెంబ్లీ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఇక సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ వేశారు. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులకు ఎంఐఎం పార్టీ మద్దతు పలికింది. కాగా అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్‌కు 4, బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్సీ దక్కనున్నాయి. అయితే తమకు దక్కిన నాలుగు సీట్లలో ఒక సీటును పొత్తు ధర్మం ప్రకారం సీపీఐకి కాంగ్రెస్ కేటాయించింది.