Friday, September 20, 2024
HomeతెలంగాణMoinabad: 111 జీవో రద్దు, మొయినాబాద్ లో సంబరాలు

Moinabad: 111 జీవో రద్దు, మొయినాబాద్ లో సంబరాలు

111 జీవోను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు సిఎం కేసీఆర్ కేబినెట్ ప్రకటనతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని 84 గ్రామాల ప్రజలు ఆనందంతో కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, బాణా సంచా కాల్చారు. ఈ సందర్భంగా ఎంపి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ హైదరాబాద్ కు ఆమడ దూరంలో ఉండి అభివృద్ధికి నోచుకోని ఆయా  గ్రామాలు నేటి 111 జీవో రద్దుతో మినీ హైదరాబాద్ ను తలపించేలా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. రైతులు, గ్రామ ప్రజలు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. 1111 జీవోను  రద్దు చేసి చేవెళ్ళ గ్రామాల అభివృద్దికి బాటలు వేస్తారన్న సిఎం కేసీఆర్ గారిపై ఉన్న నమ్మకంతోనే ఆనాడు టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని, నేటికీ అధి సాధ్యమైందని, చేవెళ్ళ నియోజకవర్గ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు, కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఎమ్మెల్యే కాలే యాదయ్య. కార్య క్రమమంలో మొయినాబాద్ మండల  బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ఎంపీపీ నక్షత్రం జయవంత్, జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్, ప్యాక్స్ ఛైర్మన్  చంద్రరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ రావుఫ్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు అంజయ్య గౌడ్, శ్రీనివాస్, వెంకటరెడ్డి, జి. రాజు, ఈశ్వర్,  బట్టు మల్లేష్, అర్జున్, రవీందర్ తదితర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News