మొయినాబాద్ మండల పరిధిలోని అమ్డాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠాలు బోధించారు. ఒకరోజు బోధనలో ఎదురైన అనుభవాలు వాటిని ఏవిధముగా అధిగమించాలన్న విషయాలను విద్యార్థులే గురువులుగా మారి స్వయంగా తెలుసుకున్నారు. విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ నాణ్యమైన విద్యను అందించాలని గౌరవ ప్రథానోపాద్యాయురాలుగా వ్యవహరించిన పి. అక్షిత కోరారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేణుక, పాఠశాల ఉపాధ్యాయులు నగేష్ బాబు, సత్యనారాయణ రెడ్డి, స్వరూప,మంజుల, సంజీవన్ కుమార్, సంగీత, అరుణ, సత్యనారాయణ. ప్రజా ప్రతినిధులు , గ్రామ పెద్దలు, యువకులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానోపాద్యాయులుగా పి. అక్షిత, విద్యాశాఖ మంత్రిగా k. అక్షిత, కలెక్టర్గా మానస, డిఈఓగా మనోజ్ కుమర్, ఎంఈఓ గా ధనుష్ వ్యవహరించడం జరిగింది. ప్రిన్సిపల్ రేణుక, ఉపాధ్యాయులు అధ్యాపకులుగా మారిన విద్యార్థులను అభినందించారు.