భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్ ను శుక్రవారం నాడు జాతర చైర్మన్ మాడుగుల వీరస్వామి అమ్మవార్లకు కొబ్బరికాయ కొట్టి ఆవిష్కరించారు. మాడుగుల వీరస్వామి మాట్లాడుతూ.. ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జాతర ఘనంగా నిర్వహిస్తున్నట్లు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ముల్కనూరులో అంగరంగ వైభవంగా జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకి తరలి రావాలని తెలిపారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు మినీ మేడారంగా పిలవబడే ముల్కనూర్ జాతరకు వచ్చి సమ్మక్క సారలమ్మ కృపకు పాత్రులు కావాలని పేర్కొన్నారు. పోలీస్ శాఖ పర్యవేక్షణలో జాతర నిర్వహించబడుతుందని తెలిపారు.
జాతరకు వచ్చే భక్తులకు మొబైల్ బాత్రూం, చలువ పందిల్లు, లైటింగ్స్, త్రాగునీటి వసతి, అన్ని ఏర్పాట్లను సమకూర్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమదేవరపల్లి మండల తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో వీరేశం, సబ్ ఇన్స్పెక్టర్ సాయిబాబు, ఎంపీఓ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి జంగం పూర్ణచందర్, ఉత్సవ కమిటీ మెంబర్లు, కోడూరి సరోజన, ఆదరి రవి, కొలుగూరి రాజు తదితరులు పాల్గొన్నారు.