Saturday, November 23, 2024
HomeతెలంగాణMuthireddy: తెలంగాణ రైతులపై విషం చిమ్మే వ్యాఖ్యలు సరికాదు

Muthireddy: తెలంగాణ రైతులపై విషం చిమ్మే వ్యాఖ్యలు సరికాదు

రేవంత్ దిష్టి బొమ్మ దగ్ధం

రైతులపై విషం చిమ్మే వ్యాఖ్యలు సరికాదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్రంగా ఖండించారు. విద్యుత్తు సరఫరాపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చేర్యాల మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు అప్రకటిత విద్యుత్ వల్ల ట్రాన్స్ఫార్మర్స్ పేలి, కాలిపోయిన మోటార్లు, ఎండిపోయిన పొలాలు ఉండేవని అన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా , పెట్టుబడి సహాయం,బీమా వంటి సంక్షేమ పథకాలు అమలుచేస్తూ ఉంటే కాంగ్రెస్, నాయకులు మాత్రం రైతులకు మూడు గంటల విద్యుత్ సరఫరా చాలని రైతులపై విషం చిమ్ముతూన్నారన్నారు. గతంలో ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టి ఎదురు చూసేవారని కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కోసం ఇబ్బందులు లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కతుందని అన్నారు. దేశ వ్యాప్తంగా ధాన్యం పండించడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఉందని రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం రైతులపైవిషం చిమ్మే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేసిన రానున్న రోజుల్లో బిఆర్ఎస్ ప్రభుత్వన్ని ఏర్పాటు చేస్తుందని దేశానికి కేసీఆర్, రాష్ట్రనికి కేటీఆర్ నాయకత్వం వహిస్తారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అంకుగారి స్వరూప రాణి శ్రీధర్ రెడ్డి, ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్,బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ముస్త్యాల నాగేశ్వరరావు,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పెడుతల ఎల్లారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అనంతల మల్లేశం, ఏఏంసి వైస్ చైర్మన్ పూర్మ వెంకటరెడ్డి, బీఆర్ఎస్ యూత్ నాలుగు మండలాల అధ్యక్షులు శివగారి అంజయ్య, బీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు మీస పార్వతి- సత్యనారాయణ, పట్టణ అధ్యక్షురాలు తాడెం రంజిత-కృష్ణమూర్తి, సోషల్ మీడియా మండల అధ్యక్షులు తాటికొండ సదానందం, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కోతిదాసు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News