ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని సీఎం కేసిఆర్ హామీ ఇచ్చారని ములుగు జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి తెలిపారు. హైదరాబాదులో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ ములుగు జిల్లా పూర్తిగా వెనుకబడిన ప్రాంతమని, ఆదివాసి గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్నారని అన్ని వర్గాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరానని ఆమె తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ఏజెన్సీ గ్రామాలకు రాక పోకలు నిలిచిపోవడంతో పాటు వందలాది ఇందు కూలిపోవడంతో పాటు పలువురు మృత్యువాత పడ్డారని సీఎంకు వివరించినట్లు ఆమె తెలిపారు. సీఎం ను కలవడానికి అవకాశం కల్పించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కు, ఎమ్మెల్సీ పళ్ళ రాజేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.