ఎన్నో కలలతో ఉన్నత విద్య కోసం అమెరికా(America) వెళ్లిన నల్గొండ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని బ్రెయిన్ డెడె కావడంతో ప్రాణాలు కోల్పోయింది. నల్లగొండ(Nalgonda) జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లి గ్రామానికి చెందిన ప్రియాంక ఎమ్మెస్సీ అగ్రికల్చర్ కోసం అమెరికా వెళ్లింది. అలబామా విశ్వవిద్యాలయం నుండి ఇటీవల మాస్టర్స్ పూర్తి చేసింది. ఉద్యోగ అన్వేషణలో ఉన్న ఆమెను మృత్యువు వెంటాడింది. క్యాన్సర్ వ్యాధికి గురికావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు సన్నిహితులు. అయితే బ్రెయిన్ డెడ్ అయి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆమె మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురు మృతదేహాన్ని త్వరగా స్వగ్రామం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.