Tuesday, November 26, 2024
HomeతెలంగాణNanpur: మనం ప్రకృతిని కాపాడితే అది మనలను కాపాడుతుంది

Nanpur: మనం ప్రకృతిని కాపాడితే అది మనలను కాపాడుతుంది

స్వచ్ఛదనం-పచ్చదనంలో..

ప్రకృతిని మనం కాపాడితే అది మనలను కాపాడుతుందని నస్పూర్ మున్సిపల్ కమీషనర్ సతీష్, చైర్మన్ సురిమిళ్ళ వేణు అన్నారు. నస్పూర్ మున్సిపల్ 16వ వార్డులో స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ.. చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుని, రోగాలు రాకుండా చూసుకోవాలని, మొక్కలను పెంచాలని, ప్లాస్టిక్ ను వాడవద్దని, రోడ్లపై చెత్త వేయవద్దని ఎయిమ్స్ స్కూల్ విద్యార్థులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. వార్డ్ లో విద్యార్థులు ఉపాధ్యాయులు పచ్చదనం పరిశుభ్రత కోసం నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ లావణ్య దేవేందర్, ఎయిమ్స్ స్కూల్ కరస్పాండెంట్ రామకృష్ణ ఏఎన్ఎంలు,ఆశ వర్కర్లు, అంగన్వాడి టీచర్ లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోటగిరి రాజయ్య, కాంగ్రెస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News