Thursday, September 19, 2024
HomeతెలంగాణNanpuru: రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలి

Nanpuru: రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలి

విధి నిర్వహణలో ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని ఆర్కే-7 గనుల గ్రూపు ఏజెంట్ అధికారి మాలోత్ రాముడు పేర్కొన్నారు. ఇటీవల ఏజెంట్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆర్కే-న్యూటెక్ గనిని సందర్శించి ఉద్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏజెంట్ మాలోత్ రాముడు మాట్లాడుతూ… ప్రతిఒక్కరూ రక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని తెలిపారు. నిత్యం యోగా, వ్యాయామం సాధన చేయాలని పేర్కొన్నారు. గనుల్లో గైర్హాజరును తగ్గించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. దీర్ఘకాలంగా విధులకు హాజరుకాని వారి ఇబ్బందులను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. ఉద్యోగుల హాజరు పెరిగితే ఉత్పత్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ నిర్దేశిత లక్ష్య సాధనకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ స్వామిరాజు, రక్షణాధికారి కొట్టి రమేష్, కార్యదర్శి జంపయ్య, సంక్షేమాధికారి పాల్ సృజన్, ఇంజినీర్ కృష్ణ , సర్వే అధికారి పిచ్చేశ్వర్రావు, వెంటిలేషన్ అధికారి శంకర్, అండర్ మేనేజరు మిట్టపల్లి శ్రీనివాస్, సాత్విక్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News