నేలకొండపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కూతురు, దీపికారెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని..అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి మరోసారి తన తండ్రిని పాలేరు ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టి మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, జడ్పి ఉపాధ్యక్షురాలు, మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, మండల రైతు కన్వీనర్ శాఖమూరి సతీష్, మార్కెట్ కమిటీ చైర్మన్ నంబూరు శాంత, ఎంపీటీసీ శీలం వెంకటలక్ష్మి, బిఆర్ఎస్ నాయకులు కోటి సైదారెడ్డి, మరికంటి వేణుబాబు, నంబూరి సత్యనారాయణ, సిడిసి చైర్మన్ నెల్లూరు లీలా ప్రసాద్, వంగవీటి నాగేశ్వరరావు, గొలుసు రవి, సర్పంచ్ రాయపూడి నవీన్ పాల్గొన్నారు.