ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక తొలిసారి కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రానుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సరికొత్త కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడలోకి రానుంది. ఎల్బీ స్టేడియంలో సుమారు లక్షమంది మధ్య రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కర్నాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ పెద్దల సమక్షంలో రేవంత్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రేవంత్ బంధువులు, మిత్రులు ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివస్తున్నారు. నయా జోష్ లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు తారాస్థాయికి చేరిన వేళ రేవంత్ అందలం ఎక్కనుండటం విశేషం.
ఇక డిప్యుటీ సీఎంలు, మంత్రులుగా ఎవరెవరికి ఛాన్స్ దక్కనుంది, ఎవరికి ఏ శాఖలు దక్కనున్నాయన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.