సమాంతరంగా సంక్షేమం, అభివృద్ధి, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో అగ్రస్థానంలో తెలంగాణ నిలిచిందని రాష్ట్ర వైఎస్ఆర్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి మంత్రి క్యాంపు కార్యాలయంలో 106 మంది లబ్దిదారులకు 42.50 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసి, వారితో సహపంక్తి భోజనం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, అమ్మవడి, న్యూట్రిషన్ కిట్, ఆసరా ఫించన్లలో తెలంగాణ దేశానికే ఆదర్శం గా నిలిచాయని, సంక్షేమ గురుకుల పాఠశాలలతో మారిన విద్యారంగ స్వరూపం, కేసీఆర్ కిట్, నూతన వైద్య కళాశాలలతో మారిన వైద్యరంగం,తెలంగాణ ఆసుపత్రులు కాన్పులలో రికార్డులు సృష్టిస్తున్నాయనీ అన్నారు.
మన ఊరు – మన బడి కార్యక్రమంతో మారిన విద్యారంగ స్వరూపం, ఆపన్నులకు అండగా నిలిచేందుకే ముఖ్యమంత్రి సహాయనిధి ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.పేద, మధ్యతరగతి వర్గాలకు సర్కారు సాయంతో ఊరట కలుగుతుందని,తెలంగాణలో ప్రతి గడపకూ సంక్షేమం, ప్రతి గ్రామంలో అభివృద్ధి జరుగుతుందన్నారు.పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలవాలి .. కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరచాలని పిలుపునిచ్చారు.