ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని 2024 సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక శాఖ ఎనిమిది కేటగిరీలలో నిర్వహించిన పోటీలలో ఉత్తమ పర్యాటక గ్రామంగా “క్రాఫ్ట్స్” కేటగిరీలో నిర్మల్ జిల్లా ఎంపికైంది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ ముఖ్య అతిధిగా జరిగే కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, నిర్మల్ టాయ్స్, ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు ఎస్.పెంటయ్య పురస్కారాన్ని స్వీకరించారు.