సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్ హీరో అల్లు అర్జున్‌గా(Allu Arjun) మారుతోంది. బన్నీపై కాంగ్రెస్ నేతల మాటల దాడి జరుగుతూనే ఉంది. తాజాగా నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ.. ‘పుష్ప 2’ చెత్త సినిమా అంటూ మండిపడ్డారు. అల్లు అర్జున్ ఆంధ్రోడివి ఆంధ్రోడిలానే ఉండు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అల్లు అర్జున్.. రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని ఏమైనా అంటే తెలంగాణలో నీ సినిమాలు ఆడనియ్యం అంటూ వార్నింగ్ ఇచ్చారు. పగటి వేషాలు వేసుకొని తెలంగాణకు బతకడానికి వచ్చావు.. అలాగే బతుకు అంటూ రెచ్చిపోయారు. తెలంగాణ కోసం సినిమా వాళ్లు ఏం చేశారని నిలదీశారు. దీంతో భూపతి రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మళ్లీ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.