Sunday, December 8, 2024
HomeతెలంగాణNizampet: ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే కేపీ

Nizampet: ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే కేపీ

నిజాంపేటలో పలు ప్రాంతాలు జలమయం

నిజాంపేట్ మున్సిపాలిటీ బాచుపల్లి, ప్రగతినగర్ వరద ముంపు ప్రాంతాల అప్రమత్తంగా ఉండాలని, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డ్ నెంబర్ ఒకటి బాచుపల్లి డివిజన్ ప్రగతి నగర్ లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కమిషనర్ రామకృష్ణ రావు సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి స్థానిక డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి ప్రజాప్రతినిధులతో కలిసి వరద ముంపు ప్రాంతాలు పర్యటించారు.

- Advertisement -

అలాగే తన అనుచరుల ద్వారా బచుపల్లిలోని ప్రణీత్ ప్రణవ్ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా ప్రహరీ గోడ కూలే స్థితిలో ఉన్నందనీ తెలుసుకొని వెంటనే అధికారులను అప్రమత్తం చేసి వారితో ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులు సమీక్షించి ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ పరిధిలో శిథిలావస్థలో ఉన్న నిర్మాణ సముదాయాలు గుర్తించి తగు చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యన్ యం సీ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,సీనియర్ నాయకులు యన్ యం సీ అధికారులు, బాచుపల్లి సిఐ సుమన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News