కల్తీకల్లును పూర్తిగా నివారించేందుకు గత ప్రభుత్వం హరితహారం పథకం కింద ఈత వనాలను నటించింది. అవి ఇప్పుడు ఎక్కడా కనబడటం లేదు. ఉన్నవాటి పరిరక్షణ లేక మొక్కల ఎదుగుదల తగ్గి విడుగు బారిపోతున్నాయి. ప్రభుత్వం హరితహారం పథకంలో వివిధ రకాల మొక్కలను ప్రత్యేకంగా తెప్పించి నాటిస్తున్నా, నివారణ లోపం వల్ల లక్ష్యం నీరుగారిపోతుంది. జిల్లాలో ఈత వనాలు విస్తీర్ణం తక్కువ. ఈ నేపథ్యంలో ఏట హరితహారం పథకంలో ఈత మొక్కలు నాటించే కార్యక్రమం కొనసాగుతోంది. గత మూడేళ్ల వ్యవధిలో 1,15,900 మొక్కలు నాటారు. అందులో 10 శాతం కూడా కనిపించడం లేదు. వాగులు, వంకల పక్కనున్న ఈత చెట్లను రైతులు క్రమీపి తొలగించి సాగు భూములుగా మార్చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాటిన మొక్కలను సైతం తొలగించేస్తున్నారు. ఉన్నా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత వారవెరన్నది కూడా తెలియని పరిస్థితి ఉంది.
లోపమెవరిది?
ఇక ఈత మొక్కలు నాటే కార్యక్రమంతా అబ్కారీ శాఖ పర్యవేక్షణలో ఉంటుంది. వారు నాటిన మొక్కలను బతికించే బాధ్యత డిఆర్డిడిఏ పరిధిలో గ్రామ పంచాయతీలు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టుకొచ్చినట్లు కనిపిస్తుంది. రెండు శాఖల పరిస్థితి కూడా అలాగే ఉంది. తమ శాఖ పరిధిలో విధించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటడం మాత్రమే మా వంతు బ్రతికించుకునేది పంచాయతీల వంతు అన్న విధంగా శాఖల యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుంది. జిల్లాలో ప్రతి మండలంలో ఈత వనాలను నాటారు. కానీ మొక్కలు మాత్రం కనిపించడం లేదు. ఉన్న వాటికి అధికారుల పర్యవేక్షణ, నిర్వహణ లేకపోవడంతో గడ్డిలో కలిసిపోయ్యయి. వీటిని నాటడం నిర్వహణ కోసం వేట రూ. లక్షలు ఖర్చవుతున్నాయి. తప్ప ఆశించిన ఫలితం మాత్రం కనిపించడం లేదు.
ఈత వనాలు లేవు..కాబట్టి కల్తీ కల్లు..
ఈత వనాలు విరివిగా పెంచి కల్లుకు బదులుగా నీరా దుకాణాలు తెరిపిస్తామని అప్పట్లో ఆబ్కారి శాఖ మంత్రి ప్రకటన కూడా చేశారు. జిల్లాలో మొత్తం వెతికినా నీరా దుకాణాలు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఎక్కడ చూసినా కల్తీకల్లు దుకాణాలే కనిపిస్తున్నాయి. సిహెచ్, డైజోపాం, అల్ఫజొలం లాంటి మత్తు పదార్థాలు కలిపి కల్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. గ్రామాల్లో కల్తీ కల్లు తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. బయటకు రావడం లేదు గాని నిత్యం జిల్లా వ్యాప్తంగా ఎక్కడో ఒక గ్రామంలో ఏదో ఒకచోట కల్తీ కల్లు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. వీటిని అరికట్టాలంటే ఈత వనాలు పెంచడంతోనే సాధ్యమని ప్రభుత్వం భావిస్తున్నా క్షేత్రస్థాయిలో లక్ష్యానికి మాత్రం తూట్లు పడుతున్నాయి.
“జిల్లాలో పలు మండలాల్లో నాటిన ఈత వనాలను పరిశీలిస్తాం. ఉన్న ఈత వనాలను సంరక్షించేందుకు డిఆర్డిఏ, పంచాయితీ శాఖల అధికారులకు మాట్లాడి ఈత వనాలను పెంచేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఆదేశిస్తే మళ్లీ మొక్కలను నాటేందుకు భూములను గుర్తిస్తాం” అని ఆబ్కారి సీఐ అశోక్ కుమార్ తెలిపారు.