బీఆర్ఎస్ మండల ప్రచార కార్యదర్శి అచ్చా నాగేశ్వరరావు తన పదవికి మరియు క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేసి భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భద్రాచలంలోని ఎమ్మెల్యే స్వగృహంలో మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేని కలిసి అనంతరం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి మరియు రెవిన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, భద్రాచలం నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా ముఖ్య కార్యకర్తలు అభీష్టం మేరకు, ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. అనంతరం పట్టు శాలువా ఎమ్మెల్యేకు కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతానని తెలిపారు.