Tuesday, November 5, 2024
HomeతెలంగాణOne Day Classes: తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు

One Day Classes: తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు

One Day Classes| తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 30 వరకు ఈ ఒంటిపూట బడులు కొనసాగనున్నాయని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కులగణన సర్వేలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పాల్గొననున్నారు. దీంతో ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనిచేయనున్నాయి. కులగణన సర్వే పూర్తయ్యే వరకు ఈ ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.

- Advertisement -

ఈ నేపథ్యంలో నవంబర్ 30 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉపాధ్యాయులు సర్వేలో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 80 వేల మంది ఎన్యుమరేటర్లు ఈ కులగణన సర్వేలో పాల్గొంటారు. కాగా ఈ సర్వేలో భాగంగా ప్రతి కుటుంబం వివరాలను సేకరించనున్నారు. కులం, మతం, సంపాదన, ఉద్యోగం, ఆస్తుల వివరాలు, మొబైల్ నెంబర్ వంటి వివరాలు తీసుకోనున్నారు. ఈ సర్వే ఆధారంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News