ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో సాధించిన ప్రగతిని పుస్తక రూపంలో రూపొందించడం ప్రస్తుత పరిస్థితులలో తెలుగు ప్రభ దినపత్రికకే సాధ్యమైందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ సారధి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన ప్రగతిపై తెలుగు ప్రభ దినపత్రిక రూపొందించిన ‘ఉద్యమ నేత సంక్షేమ ప్రదాత’, ‘దేశానికి దిక్సూచి కేసీఆర్’ పుస్తకాలను గురువారం వీణవంక మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… అనతి కాలంలోనే తెలుగు ప్రభ దినపత్రిక బహుళ పాచుర్యం పొందిందని నిస్సంకోశంగా వార్తలను ప్రచురించడంలో ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు అనునిత్యం పత్రికలు పని చేస్తుంటాయని అన్నారు. ప్రజలను చైతన్య పరచడంలో ముందుంటున్న తెలుగు ప్రభ దినపత్రిక యాజమాన్యాన్ని ఈ సందర్భంగా అభినందించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే పత్రికలు ప్రజలను చైతన్యవంతం చేయడంలో తగు పాత్ర పోషించాలని ఇట్టి విషయంలో తెలుగు ప్రభ దినపత్రిక ముందుండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్, జమ్మికుంట కౌన్సిలర్ గాజుల భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు కల్వల కిషన్ రెడ్డి, దరుగుల రాకేష్, తెలుగు ప్రభ దినపత్రిక కరీంనగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గొల్లె రామస్వామి, ఆర్సి ఇంచార్జ్ రాజేష్, స్థానిక రిపోర్టర్లు కడిపికొండ కొండల్ రెడ్డి, పెరుమండ్ల రవీందర్ గౌడ్, కొండపాక అశోక్ గౌడ్ పాల్గొన్నారు.