భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పర్ గ్రామానికి చెందిన సుమారు 50 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ యువత ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పైళ్ళ శేఖర్ రెడ్డి సమక్షంలో BRS పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకే ప్రతి ఒక్కరు ఈ అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మడుగుల ప్రభాకర్ రెడ్డి వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి,పర్ని మల్లారెడ్డి పాల్గొన్నారు.