Sunday, November 16, 2025
HomeతెలంగాణPailla Sekhar: సిసి రోడ్డు పనులు సమీక్షించిన ఎమ్మెల్యే

Pailla Sekhar: సిసి రోడ్డు పనులు సమీక్షించిన ఎమ్మెల్యే

రాష్ట్రంలో మున్సిపాలిటీలు, గ్రామాలని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నాం

భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 4వ వార్డు ఇందిరా నగర్, హస్తినాపురం కాలనీలో ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి వాడ వాడ తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న సిసి రోడ్ పనులను, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను పరిశీలించి కాలనీలలో మిగిలి ఉన్న సీసీ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరగా పూర్తిచేయాలని ప్రజా ప్రతినిధులను, అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మున్సిపాలిటీలు, గ్రామాలని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నామని ఇది ఒక్క బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గుండు మధు,పెద్దల చక్రపాణి, సామల మల్లారెడ్డి, కుడికాల అఖిల బలరాం, దేవరాయ కుమార్, కాలనీ వాసులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad