Friday, April 4, 2025
HomeతెలంగాణPailla: కనుముక్కల గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన

Pailla: కనుముక్కల గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన

భువనగిరి నియజకవర్గం శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామంలో పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించిన అనంతరం గ్రామస్తులను గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, తరువాత అక్కడే ఉన్న సంబంధిత అధికారులను సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం గ్రామంలోని రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి యువజన సంఘ భవనానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచంపల్లి మండల వ్యాప్తంగా ప్రతి గ్రామాల్లో అభివృద్ధి లక్ష్యంగా అన్ని రంగాల్లోనూ పనులు ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మడుగుల ప్రభాకర్ రెడ్డి, జెడ్పిటిసి కోట పుష్పలత మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, సర్పంచ్ కోటా అంజిరెడ్డి, ఎంపీటీసీ బత్తుల మాధవి శ్రీశైలం, పోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్,మండల పార్టీ అధ్యక్షులు పాటి సుధాకర్ రెడ్డి, మండల పార్టీ సీనియర్ నాయకులు రావుల శేఖర్ రెడ్డి, గునిగంటి మల్లేష్ గౌడ్, చేరాల నరసింహ, అంకం యాదగిరి, తంగెళ్ల దశరథ, వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News