Monday, November 25, 2024
HomeతెలంగాణPalakurthi: పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి

Palakurthi: పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి

రేపు ఉదయం 7 గం. మాక్ పోలింగ్

వరంగల్ పార్లమెంట్ ఎన్నికల కోసం పాలకుర్తి నియోజకవర్గనికి చెందిన ఈ.వీ.ఎం ల పంపిణి చేసినట్టు పాలకుర్తి నియోజకవర్గ ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ కలెక్టర్ బి. రోహిత్ సింగ్ తెలిపారు. పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం పాలకుర్తి సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఆయన సందర్శించారు.

- Advertisement -

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గం లో పోలింగ్ నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది సకాలంలో వారికా కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ సరళిని పరిశీలించి, పోలింగ్ సామాగ్రిని తరలించే సమయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీల సమక్షంలో ఉదయం 5.30 నిమిషాలకు మాక్ పోల్ నిర్వహించి, ఏడు గంటలకు పోలింగ్ ను ప్రారంభించాలన్నారు.

విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయంతం చేయాలని సూచించారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తామని, నియోజకవర్గంలో ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని పోలింగ్ శాతం పెంచాలని కోరారు. అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News