Tuesday, May 20, 2025
HomeతెలంగాణPalakurthi: చండికా అమ్మ వారి ప్రతిష్టలో మంత్రి ఎర్రబెల్లి

Palakurthi: చండికా అమ్మ వారి ప్రతిష్టలో మంత్రి ఎర్రబెల్లి

పాలకుర్తి నియోజక వర్గ కేంద్రం, ప్రముఖ పవిత్ర పుణ్య క్షేత్రం పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన సతీమణి ఉషా దయాకర్ రావు గారు శ్రీశ్రీశ్రీ చండికా అమ్మవారి ప్రతిష్టలో భాగంగా జరిగిన గణపతి పూజ, పుణ్యా వచన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ నెల 18వ తేదీన పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఘనంగా మహా శివరాత్రి పర్వదిన ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ రోజు చండిక అమ్మవారి ప్రతిష్ట, రుద్ర హోమసహిత శత చండీ హోమం మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉషా దయాకర్ రావు దంపతులతో పాటు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News