Friday, November 22, 2024
HomeతెలంగాణPalakurthi: మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన

Palakurthi: మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన

ప్రభుత్వం రైతులకు అండగా ఉంది. ఆఖరు గింజ వరకు ధాన్యం, మక్కలను కొనుగోలు చేస్తుంది. అధైర్య పడొద్దు. అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులకు భరోసా ఇచ్చారు. పాలకుర్తిలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మంత్రి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లారీలు వస్త లేవని మంత్రికి రైతులు చెప్పగా, వెంటనే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాలని అదేశించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి రైతులతో మాట్లాడుతూ, సీఎం కెసిఆర్ రైతు పక్షపాతి. రైతుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదు కుంటున్న సీఎం కెసిఆర్, ధాన్యం, మక్కలను కూడా కొనుగోలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పంటల నష్టాలకు ఎకరాకు రూ.10 వేలు ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయమన్నారు. ఇంతగా చేస్తున్న ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టడం జరుగుతుందా? ఆలోచించండి. ప్రభుత్వానికి సహకరించండి. ఆఖరు గింజ వరకు రైతుల పంటలను ప్రభుత్వం తీసుకుంటుంది అని మంత్రి వివరించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను అదేశించారు.

ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News