ఘనపూర్ సబ్ డివిజన్ పరిధిలోని విద్యుత్ సిబ్బందికి స్ధానిక శుభం కన్వెన్షన్ హాల్ లో నోడల్ అధికారి, డిఈ/టెక్నికల్ ప్రభావతి పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ ఈ ఆపరేషన్ జనగాం సర్కిల్ శ్రీ వేణుమాధవ్ మాట్లాడుతూ.. నిరంతర సేవలు అందించే విద్యుత్ సిబ్బంది విధి నిర్వహణలో తడబాటు లేకుండా అన్నివిధాలా భద్రతా నియమాలు పాటించి, విధులు నిర్వహిస్తే ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగవన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా అందరి మధ్య సమైక్యత ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే తొందర పడకుండా బాగా ఆలోచించి ఏలైన్ మీద పనిచేస్తున్నారో అదే లైన్ క్లియర్ తీసుకొని పనిచేయాలన్నారు.
తమ గురించే కాకుండా తమతో పాటు పనిచేసే సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను కూడా గుర్తుంచుకొని అతి జాగ్రత్తగా పనిచేసుకోవాలన్నారు. విధినిర్వహణలో ఎలాంటి ధూమపానం, మద్యపానం, ఫోన్లు, బ్లూటూత్ లాంటివి వినియోగించ కూడదన్నారు. ప్రవర్తనలో మార్పు రావాలన్నారు. ప్రవర్తన జీవితాన్నే మార్చేస్తుంది అన్నారు.
ఘనపూర్ డిఈ ఆపరేషన్ ఎం.హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. విధులు నిర్వహించే సమయంలో సిబ్బంది సేఫ్టీ పరికరాలు ఉపయోగించి, మరమ్మతులు చేపట్టాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసినట్లు తమ దృష్టికి వస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఓ జయరాజ్ డి ఈ MRT విజయ్ , పాలకుర్తి ఎడిఈ ఆపరేషన్స్ బాలగంగాధర్ తిలక్, ఎడిఈ ప్రొటెక్షన్ శ్రీరాం, ఏ ఈ రణధీర్, రామకృష్ణ సబ్ ఇంజనీర్ మాష్టర్ ట్రేనర్స్ అల్వాల మహేందర్ రెడ్డి, ఒడ్డేపల్లి యాదగిరి రమేష్ లైన్ మెన్ లు రమేష్ రామ్మూర్తిల, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.