గత టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యము వలన రైతులకు శాపంగా మారిందని పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. పాలకుర్తి మండలంలోని వివిధ గ్రామాల రైతులకు సంబంధించి ఎస్సారెస్పీ కాలువలను ఆమె సందర్శించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ..కోమటిగూడెం, బోయిన గూడెం, గూడూరు, కోతుల బాగ్, తిరుమలగిరి, నర్సింగాపూర్ గ్రామాలకు సంబంధించి ఎస్ ఆర్ ఎస్ పి కెనాల్ కు సంబంధించి 4L మరియు 5L పాయింట్లను సందర్శించి వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి ఆయా గ్రామాలలోని రైతుల గోడును క్షుణ్ణంగా విన్నారు. తప్పకుండా రైతులకు న్యాయం చేయడనిధులు రైతులకు సంబంధించిన ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు తప్పక కృషి చేస్తానని అన్నారు. కాలువలపై సంబంధిత అధికారులతో పూర్తిస్థాయి పనులకు ఎస్టిమేషన్లు తెప్పించి ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి పనులు పూర్తి చేసి రైతులను కాపాడుకుంటానని అన్నారు.
ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు చేసే అసత్య ప్రచారాలను రైతులు గమనిస్తున్నారని, ఇలాంటి తప్పుడు కూతలు కూస్తే అటువంటి నాయకులను ప్రజలు గ్రామాల్లో తిరగనివ్వరని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షులు గిరగాని కుమార స్వామి, వరంగల్ డీసీసీబీ డైరెక్టర్ కాకిరాల హరి ప్రసాద్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు గాదెపాక భాస్కర్, మాజీ సర్పంచులు మాచర్ల పుల్లయ్య, పోగు శ్రీనివాస్, పాలకుర్తి పట్టణ అధ్యక్షులు నాగయ్య యూత్ కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి మరియు ఆయా గ్రామాల కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.