Saturday, July 27, 2024
HomeతెలంగాణThorruru: మద్యంపై 127 కోట్ల ఆదాయం, అయినా అద్దె భవనాలల్లోనే అబ్కారీ ఆఫీస్

Thorruru: మద్యంపై 127 కోట్ల ఆదాయం, అయినా అద్దె భవనాలల్లోనే అబ్కారీ ఆఫీస్

శిథిలావస్థలో రెంట్ ఆఫీస్

ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఎక్సైజ్‌ శాఖ అద్దె భవనాల్లో కొనసాగుతోంది. ఆ శాఖ ఆదాయం నుంచే భవనాలు, వాహనాలకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు అబ్కారీ పరిధిలో 21 మద్యం దుకాణాలు, 04 బార్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా సుమారు రూ.127 కోట్ల ఆదాయం వస్తోంది. అయినా ప్రభుత్వం ఈ శాఖపై చిన్నచూపు చూస్తోంది. తమ శాఖ నుంచి భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ సరైన వసతులు, భవనాలు కల్పించకపోవడంపై ఆ శాఖలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

- Advertisement -

రెంట్ కూడా ఇవ్వలేదని ఓనర్..

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు అబ్కారీ కార్యాలయం అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అయితే అద్దె సకాలంలో చెల్లించకపోవడంతో కార్యాలయంకు యజమానులు నోటీసులు సైతం జారీ చేసినట్లు సమాచారం. అయితే చాలా ఏళ్లుగా అద్దె భవనాల్లోనే అధికారులు పరిపాలన కొనసాగిస్తున్నారు. తొర్రూరు అబ్కారీ అద్దె భవనంకు 6033 రూపాయలు చెల్లిస్తున్నారు. కానీ యాడదికి పైగా అద్దె చెల్లించకపోవడంతో యజమానులు నోటీసులు పంపింస్తున్నరని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

శిథిలావస్థలో ఆఫీస్..

ఇది కూడా శిథిలావస్థలో ఉన్న భవనాలే కావటం మరో హైలైట్. తొర్రూరు అద్దె భవణం శిధిల వ్యవస్థలో ఉన్న బిక్కుబిక్కుమంటూ అధికారులు తమ విధులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అబ్కారీ కార్యాలయం నిర్మించాలని వేడుకుంటున్నారు.

అద్దె వాహనం..

ప్రభుత్వ కార్యక్రమాలు, లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి నిర్వహణలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది. వీరి విధి నిర్వహణలో రవాణా సహాయం కోసం ప్రభుత్వం అద్దె వాహనాలను సమకూర్చుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం అద్దె వాహన సౌకర్యం కల్పించింది. పెరిగిన డీజిల్‌, ఇతర ఖర్చులకు తగిన విధంగా ప్రభుత్వం దశల వారీగా వాహనాల అద్దెను నెలకు రూ.18వేల నుంచి రూ.33వేలకు పెంచారు. అయితే వాహనాలకు నెలకు రూ.33వేలు అద్దె పెంచిన నాటి నుంచి కొందరు ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు అప్కారి డిపార్ట్మెంట్ పేరు చెప్పుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని గట్టి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కావున ప్రభుత్వ చోరువతో ప్రైవేట్ వాహన తొలగించి ప్రభుత్వ వాహనాలను అబ్కారీ శాఖకు అందజేయాలని స్థానికులు కోరుతున్నారు. సొంత భవనానికి మోక్షమెప్పుడో తొర్రూర్ అబ్కారీ భవనానికి మోక్షం ఎప్పుడు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

భవనానికి తొర్రూర్ పట్టణం అన్నారం రోడ్డులో 20 గుంటలు కేటాయించి రెండు సంవత్సరాలు గడుస్తున్న పనులు మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు. కేటాయించిన 20 గుంటల స్థలం కొంత కబ్జాకు గురవుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొర్రూర్ అబ్కారి నుండి నెలకు 127 కోట్ల 50 లక్షలు అందాన్ని వస్తున్న అబ్కారీ భవనం మాత్రం అద్దె భవనంలో కొనసాగించడం విడ్డూరంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తొర్రూర్ అబ్కారి నూతన భవనాన్ని వెంటనే నిర్మించాలని ఇటు అధికారులు స్థానికులు ఆరోపిస్తున్నారు.

అర్ ప్రవీణ్,స్టేషన్ హౌస్ ఆఫీసర్ తొర్రూరు

“యజమాని ఖాళీ చేయమంటుండు సంవత్సరం పైగా అద్దె భవనానికి అతి చెల్లించకపోవడంతో యజమాని భవనం నుండి ఖాళీ చేయమని ఫోర్స్ చేస్తున్నారు. అదేవిధంగా ఆప్కారి భవనానికి కేటాయించిన 20 గుంటల స్థలం కబ్జాకు గురవుతుందని ఆరోపణలు వచ్చాయి, దానిపై కూడా ఎమ్మార్వోకి చెప్పి మళ్లీ కొలిపించడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ స్థలానికి ఎవరైనా కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవు”.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News