Saturday, November 15, 2025
HomeతెలంగాణPaleru: తేమశాతంతో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయండి

Paleru: తేమశాతంతో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయండి

శీనన్న భరోసా..

రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రైతాంగ సమస్యలను పరిష్కరించాలంటూ సిపిఎం మండల కార్యదర్శి తోటకూరి రాజశేఖర్ (రాజు) ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తప్పకుండా రైతాంగ సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి రాజా మాట్లాడుతూ‌ రైతులు పత్తి పంటను మార్కెట్ కు తీసుకెళ్తే తేమ శాతంతో పత్తి కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని, అలానే వరి పంటలు కోతలు కోసి కాటాల సిద్ధంగా ఉన్న ప్రభుత్వం ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని, వెంటనే ఏర్పాటు చేసి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు యడవల్లి రమణారెడ్డి, శీలం గురుమూర్తి,తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి బిక్కసాని గంగాధర్ ,వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గన్యనాయక్, కర్ణ బాబు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad