Tuesday, September 17, 2024
HomeతెలంగాణPaleru: ఎమ్మెల్యే కందాళను సన్మానించిన రైతులు

Paleru: ఎమ్మెల్యే కందాళను సన్మానించిన రైతులు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు కాల్వ నిర్మాణంలో పాలేరు నియోజకవర్గంలో తిరుమలాయపాలెం మండలంలోని లక్షల రూపాయలు విలువ చేసే వ్యవసాయ భూములను కాల్వ కింద కోల్పోకుండా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి తిరుమలాయపాలెం మండలంలోని దమ్మాయిగూడెం జింకలగూడెం ఏలువారి గూడెం, బీరోలు తాళ్ళచెరువు గ్రామాల్లో సీతారామ ప్రాజెక్టు 16వ ప్యాకేజీలో సొరంగ మార్గం ద్వారా కాల్వ ను తవ్వెందుకు అనుమతులు తీసుకొచ్చిన ఎమ్మెల్యే కందాళ ను ఆ ప్రాంత రైతులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో రైతులు క్షేమమే నాద్వేయమని పాలేరు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. ఈ ప్రాజెక్టు కింద ఓపెన్ కాల్వ కంటే సొరంగ మార్గం ద్వారా 6వందల ఎకరాల భూమిని కాల్వ కింద పోకుండా కాపాడడంతోపాటు ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 3వందల కోట్ల రూపాయలను మిగిల్చి ప్రభుత్వం కాల్వ నిర్మాణానికి పెట్టే వ్యయం తగ్గించామని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో వందలాది ఎకరాల భూమిని మిగిల్చి భావితరాలకు భూమి విలువను తెలియజేసే విధంగా చేసిన ఎమ్మెల్యే కు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎస్సీ శంకర్ నాయక్, డి రమేష్ రెడ్డి ఎంపీపీ బోడా మంగీలాల్, డిసిసిబి డైరెక్టర్ చావా వేణు ,ఖమ్మం రూరల్ మండలం ఎంపీపీ బెల్లం ఉమా, జడ్పిటిసి బెల్లం శ్రీను సర్పంచులు దేవరం దేవేందర్ రెడ్డి, వంచర్ల అలివేలుమ్మ, సత్యనారాయణ రెడ్డి ,ఆలస్యం నాగేశ్వరావు ,జోగుపర్తి వెంకటేశ్వర్లు ,బోడ మంచ నాయక్, రామ సహాయం అరవింద రెడ్డి, తుల్లూరి నాగేశ్వరావు,అరుణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News